![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1014 లో..... రాజు ఓనర్ కి వంట చేసిపెట్టాలని అడిగినందుకు ఇందు తనని బయటకు తీసుకొని వెళ్లాలని ఆర్డర్ వేస్తుంది. దాంతో చేసేదేమీ లేక రాజు తనని బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ దొంగతనం చేసి తినాలని ఉందని రాజుతో ఇందు అంటుంది. దాంతో రాజు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఐస్ క్రీమ్ ఇందు దొంగిలించి తింటుంది. పక్కకు వెళ్లి ఐస్ క్రీమ్ తింటూ మళ్ళీ ఐస్ క్రీమ్ దొంగతనం చేసిన దగ్గరికి వెళ్లి తింటుంది ఇందు. అప్పుడు ఐస్ క్రీమ్ బండి అతను చూసి.. ఈ ఐస్ క్రీమ్ మీరు కొనలేదు కదా ఎక్కడిది అని అడుగుతాడు.
ఇతనే దొంగతనం చేసాడని రాజు పై తోసేస్తుంది ఇందు. ఏంటి అయ్యా.. ఈ దొంగబుద్ది అని రాజు పై ఐస్ క్రీమ్ షాప్ బండి అతను కోప్పడతాడు. ఏంటి నా పేరు చెప్పావని రాజు అడుగుతాడు. నేను దొంగతనం చెయ్యాలనుకున్నా కానీ అతన్ని మోసం చెయ్యాలనుకోలేదు డబ్బులు ఇవ్వాలి కదా అని ఇందు అంటుంది. ఇప్పుడు నాకూ స్ట్రీట్ ఫుడ్ తినాలని అనిపిస్తుందని ఇందు అంటుంది. దాంతో రాజుకి కోపం వచ్చి పక్కకి వెళ్లి డ్రింక్ లో బీర్ కలుపుతాడు. అది ఇందు తాగుతుంది. తాగిన మైకంలో ఇందు డాన్స్ చేస్తుంది. చూడు రాజు.. ఆ చందమామ ఎంత బాగుందో కదా.. చాలా థాంక్స్ రాజు నాకు ఇంత హ్యాపీ నెస్ ఇచ్చావని రాజుని ఇందు గట్టిగా హగ్ చేసుకుంటుంది.
అటు చూడు అక్కడ స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్స్ కి పేర్లు పెట్టుకుంటున్నారంట.. ఇప్పుడు నీ సాక్షి గా ఆ స్టార్ కి ఇందు అని పేరు పెడుతున్నానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజుకి వెంకీ ఫోన్ చేసి ఈ రోజు అమ్మనాన్నల పెళ్లి రోజు అని చెప్తాడు. సర్లే నేను చికెన్ తెస్తానని రాజు అంటాడు. అలా పెళ్లి రోజు ఎవరైనా సెలబ్రేట్ చేస్తారా అని ఇందు అంటుంది. మరి డబ్బులు లెవ్వు అని రాజు అంటాడు. నేను ఒక్క పైసా ఖర్చు కాకుండా నేను సెలబ్రేట్ చేస్తాను అని ఇందు అనగానే తనని తీసుకొని రాజు ఇంటికి వస్తాడు. ఎవరు ఈ అమ్మాయి అని వాళ్ళ నాన్న అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |